సంగారెడ్డి, ఆగస్టు 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన నిజాంపూర్ (కే) ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డా.పోట్రు.రామకృష్ణ ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో జాతీయ స్థాయి విద్యారత్న పురస్కారం అందుకున్నారు. జాతీయ స్థాయి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని ఎంపిక చేసి, వారికి జాతీయస్థాయి పురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా పోట్రు.రామకృష్ణ జాతీయ పురస్కారాన్ని హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ జాతీయ అధ్యక్షుడు కొంపల్లి సత్యనారాయణ, స్వర్ణగిరి ఆలయ వ్యవస్థాపకుడు మానేపల్లి రామారావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రమేష్ చేతుల మీదుగా అందుకున్నారు. విద్యా, సామాజిక సేవా రంగంలో చేసిన విశేష సేవలకు గాను రామకృష్ణకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు అధ్యక్షుడు కొంపల్లి సత్యనారాయణ తెలియజేశారు. తనకు జాతీయ స్థాయి విద్యారత్న పురస్కారాన్ని అందజేసినందుకు రామకృష్ణ హ్యూమన్ రైట్స్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం టీవీ జోర్దార్ రాములు, సహాయ నటుడు సమ్మయ్య పాల్గొన్నారు. విద్యారత్న పురస్కారం అందుకున్న రామకృష్ణను మండల విద్యాధికారి శంకర్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు రాజశ్రీ, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, సిఆర్ పిలు, తల్లిదండ్రులు, విద్యార్థులు అభినందించారు.
జాతీయ స్థాయి విద్యారత్న పురస్కారం అందుకున్న డా.పోట్రు.రామకృష్ణ
Published On: August 10, 2025 6:16 pm