Site icon PRASHNA AYUDHAM

దళిత జ్యాతి జోలికొస్తే సహించేది లేదు – దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు తలారి ప్రభాకర్

IMG 20250208 WA0004

దళిత జ్యాతి జోలికొస్తే సహించేది లేదు

– దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు తలారి ప్రభాకర్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి ( బిబిపేట్ )

దళిత జాతి జోలికొస్తే సహించేది లేదనీ దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు తలారి ప్రభాకర్ అన్నారు. బిబిపేట్ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఒక దేవుని ఆలయం లో గ్రామంలోని కొందరు ఆలయ ఆవరణంలో బజన చేస్తుండగా అక్కడ కొందరు మాలా, మాదిగ వ్యక్తులు భక్తి పాటలు వాడుతుండగా అక్కడున్న అగ్రవర్ణానికి చెందిన ఒకరు మీరు తక్కువ కులం వారు కాబట్టి గుడిలోకి రావద్దని అక్కడనుండి పంపించి వేయడం పై గ్రామంలో నీ అన్ని దళిత సంఘాలు కలిసి గ్రామ పెద్దలతో మాట్లాడి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని నిర్ణయించి గ్రామంలోని అందరితో కలిసి భోజనం చేయడం జరిగిందన్నారు. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు దాటిన దేశంలో ఇంకా కులదీక్ష జరుగుతుందని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా మానవత్వంతో డాక్టర్ బాబాసాహెబ్ చెప్పిన విధంగా మనం మనుషులమని ఆలోచించి మనలో మానవత్వం ఉండాలని కోరారు. ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. మళ్లీ ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరుగుతే ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరుగుతుందన్నారు.

Exit mobile version