*గిన్నిస్ రికార్డు సాధించిన దమ్మాయిగూడ కుర్రాడు*
మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 17
ఈ నెల 14న హైదరాబాద్‌లోని మణికొండలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అరుణ్ కార్తీక్ తన గురువు డి. వేణుగోపాల్ చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ మరియు బంగారు పతకాన్ని అందుకున్నాడు. గత డిసెంబర్ 1న హాలెల్ మ్యూజిక్ స్కూల్ నిర్వహించిన ఆన్‌లైన్ సంగీత పోటీలలో అరుణ్ కార్తీక్ ఈ రికార్డును నెలకొల్పాడు.
కీసరలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతున్న అరుణ్ కార్తీక్ చిన్న వయస్సులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. అతడి అసాధారణ ప్రతిభకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘనతతో దమ్మాయిగూడ ప్రాంతం గర్వించదగ్గ స్థాయికి చేరుకుంది.