అనుమానస్పద స్థితిలో యువకుడి మృతి….!
దక్షిణాఫ్రిక దేశములో భిక్కనూర్ వాసి మృతి.!
అక్టోబర్ 21 కామారెడ్డిజిల్లా ప్రశ్న ఆయుధం భిక్కనూర్.
బ్రతుకు దెరువు కోసం సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్లిన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం….
బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ (32) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.మృతుడు బోరు బండి అపరేటర్ గా విధులు నిర్వహిస్తూ.. జీవనం సాగిస్తున్నారు.కాగా
శ్రీనివాస్ నివాసం ఉండే ఇంటి వెనకాల చెట్టుకు ఉరి వేసి, ఆత్మ హత్య గా చిత్రికరించినట్లు బంధువులు ఆరోపించారు. గత ఆరు నెలల క్రితం ఓ ఏజెంట్ ద్వారా ఒక దేశానికి పంపిస్తున్నానని చెప్పి మరో దేశమైన సౌతాఫ్రికాకు పంపించారని, గత రెండు రోజుల క్రితం భార్య పిల్లలతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకునే అంత పెరికివాడు కాదని.. బతుకుదెరువు నిమిత్తం ఆర్థికంగా బాగుండాలని విదేశాలకు వెళ్లినట్లుగా వెల్లడించారు.ఎవరో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు కుటుంబ ఆరోపించారు. శ్రీనివాస్ చనిపోయి రెండు రోజులు గడిచినప్పటికీ కంపెనీ నుంచి అక్కడి ప్రభుత్వం నుంచి సమాచారం రాలేదని,
ప్రభుత్వం చొరవ తీసుకొని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీనివాస్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతునికి భార్య నవనీత,ఇద్దరు పిల్లలు లాస్య,నిహాల్ ఉన్నారు.