గుర్తుతెలియని వ్యక్తి మృతి 

గుర్తుతెలియని వ్యక్తి మృతి 

గుర్తుపట్టిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వండి

నిజాంసాగర్ చౌరస్తా దగ్గర ఘటన

 గాయత్రి పచ్చబొట్టు ఆనవాలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) నవంబర్ 8

కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా సమీపంలో గల కాలభైరవ కిరాణా సూపర్ మార్కెట్ ముందు ఈ రోజు ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్యగా అంచనా.

పోలీసుల వివరాల ప్రకారం, ఆ వ్యక్తి కుడిచేతిపై “Gayatri” అని ఇంగ్లిష్‌లో పచ్చబొట్టు గలదు. ఆయన నలుపు, తెలుపు, నీలం రంగుల డబ్బాలు ఉన్న రెడీమేడ్ చొక్కా, నీలం రంగు రెడీమేడ్ ప్యాంటు ధరించి ఉన్నాడు.

ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు వెంటనే సమాచారం ఇవ్వవలసిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

📞 సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:

SHO : 8712686145

PS : 8712666242

Join WhatsApp

Join Now

Leave a Comment