లింగంపేట మండలం బాణపూర్ లో ఈ నెల 26న జరగనున్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మరియు ఆలయ ప్రారంభోత్సవానికి మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ ను బాణపూర్ తండా వాసులు ఆహ్వానించారు.
బలరాం నాయక్ నేతృత్వంలో బాణపూర్ తండా వాసులు బీబీ పాటిల్ ను కలిసి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రావాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా, ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయని, విగ్రహ ప్రతిష్టాపనతో పాటు ఆలయాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.











