కూకట్పల్లిలోని బ్రిలియంట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సంస్థ తమ కార్యాలయంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ వెంకట రామారావు పాల్గొన్నారు.
సీతారాముల కళ్యాణం సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన, కమనీయమైన వేడుక అని ఈ సందర్భంగా వెంకట రామారావు అన్నారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల వివాహం మాత్రమే కాదని, లోక కళ్యాణార్థం జరిగే ఒక దివ్య లీల అని ఆయన అభివర్ణించారు. సుఖదుఃఖాలలో, అడవిలోనైనా, రాజభవనంలోనైనా కలిసుండే ఆదర్శవంతమైన బంధానికి సీతారాములది నిదర్శనమని తెలిపారు.
కళ్యాణ మహోత్సవం అనంతరం, ప్రధాన రహదారిపై 'జై శ్రీరాం' నినాదాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచింది.
ఈ కార్యక్రమంలో బ్రిలియంట్ సంస్థ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, మేనేజర్ నరేందర్, రాకేష్ గౌడ్, ఇస్మాయిల్, గోపి, దీరన్, సునీత, సాయికిరణ్, ప్రసాద్, అశ్విని, అరుణ, సుమంత్, కిషోర్, గౌరి మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సంస్థ ఉద్యోగులలో భక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.











