కూకట్పల్లి రామాలయంలో రాబోయే శ్రీరామనవమి పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, రాబోయే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, శాంతిభద్రతల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం చర్యలు తీసుకోవాలని, భక్తులు కూడా అధికారులకు సహకరించి, వారు సూచించిన మార్గాల్లో వెళ్లాలని ఎమ్మెల్యే కోరారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు నిర్మించాలని, అన్నదానం వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రికల్, శాంతిభద్రతలు, ట్రాఫిక్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. అలాగే, మాజీ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, మాధవరం రోజా దేవి రంగారావు, మాజీ చైర్మన్ తులసిరావు, సూర్యారావు, ఆనందరావు, అశోక్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరయ్యారు.











