కూకట్పల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరగనున్న శ్రీ హనుమాన్, గరుడ విగ్రహమూర్తుల ప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు.
వడ్డేపల్లి రాజేశ్వరరావు, కూకట్పల్లి ప్రజల సంక్షేమం, ధార్మిక కార్యక్రమాలలో తన నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవస్థానంలో జరగనున్న ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన రూ.10 లక్షల చెక్కును ఆలయ మాజీ చైర్మన్ నాయినేని శ్రీనివాస్ రావు (తులసి రావు) కు అందజేశారు.
ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ, త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులతో విగ్రహ ప్రతిష్ఠాపన జరగడం ఆనందదాయకమని తెలిపారు. అలాగే, పాంచన్నీక అష్టకుండాత్మక శ్రీ రామాయణ మహాయజ్ఞ మహోత్సవంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
స్థానిక భక్తులు వడ్డేపల్లి రాజేశ్వరరావు చేస్తున్న సేవలను అభినందిస్తూ, సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంలో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి, సనాతన ధర్మ పరిరక్షణలో ఆయన కృషి ప్రశంసనీయమని తెలిపారు.











