నిజామాబాద్, జూలై 31
నిజామాబాద్ నగరంలో ఆదివారం జరగనున్న ఇందూరు ఊరపండుగ ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు. అమ్మవార్ల విగ్రహాల తయారీ, శోభాయాత్ర మార్గం, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.
నిజామాబాద్ నగరంలో ఆదివారం జరగనున్న ఇందూరు ఊరపండుగ సందర్భంగా పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు.
ముందుగా ఊరపండుగ సందర్భంగా ప్రతిష్ఠించనున్న అమ్మవార్ల విగ్రహాల తయారీ జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి, కళాకారులతో మాట్లాడారు. విగ్రహాల తయారీ పురోగతిని తెలుసుకుని, అనంతరం శోభాయాత్ర సాగనున్న మార్గాన్ని పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు, భక్తుల రాకపోకలకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
తదనంతరం సిర్నపల్లి గడిని సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. సర్వసమాజ్ సమితి ప్రతినిధులతో సమావేశమై ఊరపండుగ నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, శాంతిభద్రతల ఏర్పాట్లపై చర్చించారు. ఊరపండుగను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
ఈ పర్యటనలో ఏసీపీ ప్రకాశ్ యాదవ్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మలేష్, టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, టౌన్-1 ఎస్హెచ్వో రఘుపతి, రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్, టౌన్-4 ఎస్హెచ్వో సతీష్, టూ టౌన్ ఎస్ఐ యాదగిరి గౌడ్, సర్వసమాజ్ కన్వీనర్ రామర్థి గంగాధర్, కార్యదర్శి బంటు రాజేశ్వర్, సమితి సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.












