సంగారెడ్డి, జూలై 28
సదాశివపేట పట్టణంలోని పాతకేరిలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం తొలి మంగళవారం సందర్భంగా నిర్వహించే బోనాల మహోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సదాశివపేట పట్టణంలోని పాతకేరిలో సుమారు 200 సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా దినదినాభివృద్ధి చెందుతోంది. భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా కొలువై ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం తొలి మంగళవారం సందర్భంగా బోనాల మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు తంగడపల్లి మనోహర్ గౌడ్, కళావతి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు. తదనాంతరం అధ్యక్షుడు మనోహర్ గౌడ్ మాట్లాడుతూ ఈ పౌర్ణమ తరువాత అన్ని కులసంఘాల వారు ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారని, ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు సి.హెచ్. శ్రీనివాస్ గౌడ్, నాగులపల్లి సర్పంచ్ శివన్న, పద్మ మాణిక్యం, జగదీశ్వర్, పొన్న రాములు, పండల జగన్నాథం, మాదాసు రాజు, పరమ దాసు, సోమ శంకర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, గౌడ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.












