నిజామాబాద్, 2026-07-28
ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన షేక్ ఖలీమ్, అజీమ్, నజువత్ కుటుంబాలను నిజామాబాద్ డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్‌లో ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందిన షేక్ ఖలీమ్, అజీమ్, నజువత్ కుటుంబాలను నిజామాబాద్ డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పరామర్శించారు. మృతుల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రమాద వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఫోన్ ద్వారా వివరించారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులతో నేరుగా ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
"కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా నిలుస్తాయి. వారికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం" అని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రీతం, ముస్తఫా, వహీద్, హర్షద్, గోవర్ధన్, షమీ, అయూబ్, షోయబ్, జాఫర్, షకీల్, అఫ్ఫాన్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












