మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్ ఏకగ్రీవ ఎంపిక

మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్ ఏకగ్రీవ ఎంపిక

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్ 18 (ప్రశ్న ఆయుధం) :

మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగరంలోని మున్నూరుకాపు సంఘాల ప్రతినిధులతో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా పట్టణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ… నగరంలోని ప్రగతి నగర్ మున్నూరుకాపు సంఘంలో ఈ నెల 23వ తేదీ (ఆదివారం) న ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

సంఘ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మున్నూరుకాపు సంఘ సభ్యులందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సంజయ్ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment