అతిసార వ్యాది నిరోధక అవగాహన

*అతిసార వ్యాది నిరోధక అవగాహన*                                              *జమ్మికుంట జూన్ 24 ప్రశ్న ఆయుధం*

మంగళవారం రోజున కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ హుజురాబాద్ డిప్యూటీ ఉపవైద్యాధికారి డాక్టర్ చందు ఆదేశానుసారం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట పట్టణ పరిధిలోని జమ్మికుంట -1 కొత్తపల్లి ఆరోగ్య ఉప కేంద్రం పరిదిలలోని అంగన్వాడీ కేంద్రములలో పాఠశాలలో పిల్లలకి, విద్యార్థులకు అతి సార వ్యాది నిరోధక అవగాహన కార్యక్రమము డాక్టర్ చందన,డాక్టర్ ఫర్హానుద్దీన్ అధ్యర్యంలో నిర్వహించారు హాజరైన జమ్మికుంట మండల విద్యాధికారిణి హేమలత డాక్టర్ చందన, డాక్టర్ ఫర్హానుద్దీన్ మాట్లాడుతూ, వర్షా కాలం ప్రారంభమైనందున కలుషిత త్రాగు నీరు అపరి శుభ్రత వాతావరణం వల్ల డయేరియా ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువల్ల 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాలలో పట్టణ పరిధిలో ఆశకార్యకర్తలు, సిస్టర్స్ ఇంటింటి సర్వే చేస్తూ 5 సంవత్సరాల లోపు పిల్లలను గుర్తిస్తూ, వారికి ఓ ఆర్ యస్ పాకెట్స్ జింకు మాత్రలను ముందస్తు చర్యలోభాగంగా ఇవ్వాలని ఆదేశించారు ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ప్రోగ్రాం వచ్చేనెల 31 వ తేది వరకు నిర్వహించడం జరుగుతుందని డయేరియా వ్యాది లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గుంరిచి క్లుప్తంగా వివరించారు హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సీజనల్ వ్యాధులు వ్యాపించు విధానం, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా తెలిపారు చేతుల పరిశుభ్రత, చేతుల పరిశుభ్రత రకాల గురించి పిల్లలకి, విద్యార్థులకు డెమోనిస్ట్రేషన్ చేసి చూపించినారు. వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి చెప్పుతూ, ప్రతి ఒక్కరూ ఈ కాలనుగుణ వ్యాధుల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో మండల విద్యాధికారిణి హేమలత డాక్టర్ చందన, డాక్టర్ ఫర్హానుద్దీన్ హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్ వైజర్స్ అరుణ, రత్నకుమారి, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, ఐ సి డి యస్ సూపర్ వైజర్ శిరీష, ఏ ఎన్ ఎం ఎస్ రాధ, వాణిశ్రీ, ,అంగన్వాడీ టీచర్స్ మల్లికా, కవిత, రమ, పాఠశాలల ప్రధానోపాస్యాయులు జరినా అంజ్, జ్యోతి, మనూజ, ఆశకార్యకర్తలు సునీత, సుజాత, జయలక్ష్మి, పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment