విద్యార్థుల మేధస్సును వెలికితీయడానికి డిజిటల్ తరగతులు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): కంది మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మికగా సందర్శించారు. ఈ సందర్భముగా విద్యార్థులకు అందిస్తున్న విద్యా, ఆహారం తదితర అంశాలపై కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలలో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తరగతిలో విద్యార్థులతో కలిసి కూర్చుని ఉపాధ్యాయురాలు బోధించే విధానాన్ని పరిశీలించిన కలెక్టర్, తాను కూడా విద్యార్థులకు డిజిటల్ తరగతిని బోధించారు. విద్యార్థుల మేధస్సును వెలికి తీయడం కోసం డిజిటల్ పాఠాలు కీలకమని తెలిపారు. ఉపాధ్యాయులు ఈ దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్యం, విద్య, ఆహార నాణ్యతలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని, నూతన డైట్ మెనూ ప్రకారం ప్రతి ఒక్కరికి మంచి ఆహారాన్ని అందించాలని సూచించారు, ఆహార నాణ్యతను పరిశీలించారు. పాఠశాల ఆవరణలలో క్రమం తప్పకుండా సానిటేషన్ నిర్వహిస్తూ ఉండాలని సూచించారు. పిల్లల యొక్క మేధస్సును వెలికి తీయడం కోసం డిజిటల్ క్లాసులు నిర్వహిస్తూ ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ బడుల్లో గణనీయంగా విద్యార్థుల అడ్మిషన్లు, హాజరు శాతం పెరిగినందున అందుకు అనుగుణంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని పాఠశాల ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment