దివ్యాంగ విద్యార్థులు స్కాలర్‌ షిప్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు దివ్యాంగుల సాధికారత శాఖ ఆధ్వర్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను దివ్యాంగ విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ, 9, 10వ తరగతుల విద్యార్థులు ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్, 11, 12వ తరగతుల విద్యార్థులు పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్, డిగ్రీ, పీజీ, డిప్లొమా మరియు అంతకుమించిన కోర్సుల్లో చదువుతున్న వారు టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా https://scholarships.gov.in వెబ్‌సైట్‌లో మాత్రమే చేసుకోవాలని, చివరి తేదీ 31వరకు నిర్ణయించబడిందని ఆమె తెలిపారు. అర్హులైన సంగారెడ్డి జిల్లాలోని అన్ని దివ్యాంగ విద్యార్థులు ఈ అవకాశం కోల్పోకుండా సమయానికి దరఖాస్తు చేసుకొని నేషనల్ స్కాలర్‌షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని లలితకుమారి కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment