కనకల్లో గొర్రెలు–మేకలకు నట్టల మందు పంపిణీ
2,155 గొర్రెలు, 770 మేకలకు మందు తాగించిన పశుసంరక్షణ శాఖ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 25
కామారెడ్డి జిల్లా కనకల్ గ్రామంలో గురువారం పశుసంరక్షణ శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మొత్తం 2,155 గొర్రెలకు, 770 మేకలకు నట్టల మందు తాగించడం జరిగింది. పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు వ్యాధుల నివారణకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, పశుపాలకులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉప సర్పంచ్ మహేష్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు గ్రామ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. మండల పశువైద్యాధికారి డా. రమేష్ ఆధ్వర్యంలో పశువైద్య సిబ్బంది కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. గ్రామంలోని పశుపాలకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహకారం అందించారు.