ఆర్ బి ఎస్ కె రాష్ట్రీయ్ బాల్ స్వస్త్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

*ఆర్ బి ఎస్ కె రాష్ట్రీయ్ బాల్ స్వస్త్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ*

ప్రశ్న ఆయుధం మార్చి 12 :అంధత్వ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్షలు నిర్వహిస్తోందని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు. విద్యార్థు ల్లో దృష్టి లోపాన్ని నివారిం చేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా గురువారం బాల్కొండ లోని మహాత్మా జ్యోతిబా పూలే విద్యా ర్థులకు నేత్ర వైద్య నిపుణులు గురురాజ్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా కంటి పరీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్‌కె) కింద రెండు విడతలు మండలంలోని ప్రభుత్వ బడుల్లో శిబిరాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కంటి పరీక్షల శిబిరాలు పది రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. మండలం లో ఇప్పటి వరకు సుమారు 68 మంది విద్యార్థులకు కంటి చూపులో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలి పారు. వీరందరికి కంటి అద్దాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్ర మంలో పాఠశాల ప్రిన్సిపాల్ హైమావతి,ఆప్తమాలిజిస్ట్ గురురాజ్,ఆర్‌బీఎస్‌కె మెడికల్ ఆఫీసర్ సూర్య నారాయణ.ఏ ఎన్ ఎమ్ స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment