కొండాపూర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ

కొండాపూర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ

“మహిళల సంక్షేమం ప్రభుత్వానికి ప్రాధాన్యం” 

— ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 24

ఎల్లారెడ్డి, సోమవారం,

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వేడుకలా కొనసాగింది. రాజంపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన చీరల పంపిణీ కార్యక్రమానికి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు హాజరయ్యారు. గ్రామంలోని పెద్ద సంఖ్యలో మహిళలకు చీరలను అందజేసి వారితో పలు అంశాలపై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ—

మహిళల సంక్షేమం, వారి గౌరవం, వారి ఆర్థిక అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు ఇందిరమ్మ క్యాంటీన్, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి పలు సంక్షేమ పథకాలు మహిళల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నాయని చెప్పారు. ప్రభుత్వ సహాయంతో మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామస్థులు ప్రభుత్వం చేపట్టిన పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజంపేట మండల ఏ పీ ఎం రాజారెడ్డి మరియు సి సి, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment