చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే అని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం పటాన్ చెరు మైత్రి క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి, 69వ ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ పి .ప్రావీణ్య, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు హాజరయ్యారు. రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీల ప్రారంభం సందర్భంగా ముందుగా క్రీడా ప్రాంగణంలో క్రీడాజ్యోతిని క్రీడా పతాకాన్ని ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఈ మూడు రోజులు అత్యంత కీలకమన్నారు. ఈ మూడు రోజుల పాటు జరిగే క్రీడల్లో రాణిస్తే జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందన్నారు. చదువుతో పాటు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రాముఖ్యం లభించే వీలు ఏర్పడుతుందని అన్నారు. క్రమశిక్షణతో క్రీడా పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయి క్రీడల్లో రాణించేలా ప్రతి ఒక్క క్రీడాకారుడు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు పటాన్ చెరులో జరిగేలా ఆతిథ్యం కల్పించినందుకు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలో అత్యధిక జనాభా మన దేశంలో ఉన్నప్పటికీ కామన్వెల్త్ ఒలింపిక్ క్రీడల్లో పథకాల పట్టికలో మన దేశం చివరి స్థానంలో ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితి రూపుమాపేందుకు ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత క్రీడాకారులను వెలికి తీయడం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రానున్న ఒలంపిక్ క్రీడా పోటీల వరకు పథకాల పట్టికను దేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యం అనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రహించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ… విద్యార్థులు క్రమశిక్షణతో క్రీడా పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపిక కావాలని క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక దృఢత్వం తోపాటు విద్యా, ఉపాధి అవకాశాలలో పుష్కలమైన అవకాశాలు వస్తాయని ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని క్రీడాకారులు క్రీడల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… గత పది రోజులుగా రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు విజయవంతం కోసం అహర్నిశలు శ్రమించిన ఉపాధ్యాయులకు అధికారుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే విధంగా క్రమశిక్షణకు క్రీడా పోటీల్లో పాల్గొనాలని తమ పోలీసు శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు, విద్యార్థులకు అవసరమైన భద్రత పరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి అభద్రతాభావానికి గురి కాకుండా స్వేచ్ఛగా క్రీడా పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. ఏర్పాటు విద్యార్థులు క్రమశిక్షణతో రెఫరీలు ,కోచులు చెప్పిన విధంగా క్రీడా పోటీల్లో పాల్గొని 69 వ ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీల విజయవంతం కోసం కృషి చేయడంతో పాటు జాతీయస్థాయిలో రాణించి రాష్ట్రానికి తమ పాఠశాలలకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సంక్షేమ, క్రీడా శాఖల అధికారి ఖాసీం బేగ్, ఆర్డిఓ రాజేందర్, సంబంధిత శాఖ అధికారులు, కోచ్ లు, ఉపాధ్యాయులు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment