సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): వివిధ సమస్యలపై ప్రజలు తమ అర్జీలు, ఫిర్యాదులు సమర్పించుకునే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 13వ తేదీన యథావిధిగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి, తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులు సంబంధిత అధికారులకు అందజేయడానికి ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావచ్చని కలెక్టర్ సూచించారు.
యథా విధిగా ప్రజావాణి కార్యక్రమం: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: October 11, 2025 7:01 pm