జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులు సమన్వయంతో రైతులతో మమేకమై ఆయిల్ ఫామ్ విస్తరణలో మండలాల వారిగా ఇచ్చిన లక్ష్యాలను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ మరియు ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఉద్యాన వన శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సునీత, వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, ఉద్యాన వన శాఖ అధికారి సోమేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఉద్యానవన శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో రైతులతో మమేకమై జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన ఆయిల్ ఫామ్ విస్తరణ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో యూరియా కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా వచ్చిన యూరియా స్టాక్ ను రైతులకు పారదర్శంగా అందించాలన్నారు. ఫెర్టిలైజర్ షాపులను విధిగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఫెర్టిలైజర్స్ ఈపాస్ లో ఉన్న గ్యాప్ మండలాల శాఖ వివరాలు అందించాలని, జిల్లాలో సీడ్స్ ఫెర్టిలైజర్స్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లాలో రైతుబంధు రైతులు వివరాలు అందించాలని తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారులతో జాయింట్ ఎంక్వయిరీ చేయించి రైతులకు రైతు భరోసా అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ పనులు వేగవంతం చేయాలని ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు వాతావరణం అనుకూలంగా ఉంటుందన్నారు. సంగారెడ్డి జిల్లాకు ఈ సంవత్సరంకు 3750 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించారు ఈ లక్ష్యాన్ని వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు సహకారంతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు గాను ప్రతి ఏ ఈ ఓ కు 25 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. మండలాలు వారిగా గోద్రెజ్ ఆగ్రోవేట్ వారి ఆధ్వర్యంలో రైతుల అవగాహన సదస్సులు నిర్వహించి, సకాలంలో ఆయిల్ ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ మరియు ఉద్యానవన శాఖల లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. ఈ సమీక్షలో ఉద్యానవన శాఖ, మండల వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now