రాజకీయ పార్టీలతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, జనవరి 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని పొలిటికల్ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ సహకరించాలని కోరారు.ఎన్నికల సంఘం గైడ్లైన్స్ మేరకు జిల్లాలోని 11 మున్సిపాలిటీలలోని 256 వార్డులకు సంబంధించి ముసాయిదా ఓటర్ జాబితాను (డ్రాఫ్ట్ రోల్స్) ఈ నెల 1వ తేదీన విడుదల చేసామని తెలిపారు. అట్టి జాబితాలను సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఓటర్లు తమ పేర్లు చిరునామాలు తదితర వివరాలు ఓటర్ జాబితాలో పరిశీలించుకుని ఏవైనా అభ్యంతరాలు, క్లెయిమ్స్ ఉన్నట్లయితే ఈనెల 5వ తేదీలోపు ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించడం జరిగిందన్నారు. ఓటర్ల తుది జాబితా ఈనెల 10వ తేదీన ప్రకటించనున్నట్లు తెలిపారురాజకీయ పార్టీలకు ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఓటర్ జాబితాలను తుది జాబితా ప్రచురణకు ముందే పరిశీలించుకోవాలని సూచించారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ సూచనలు, సందేహాలను వ్యక్తం చేయగా, వాటిని ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మాధురి, పాండు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు జగన్, ఉమారాణి, డేవిడ్, జయరాజ్, షేక్ తహర్ పాషా, బందన్న గౌడ్, మహబూబ్ ఖాన్, శ్రీనివాస్, నజీముద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment