*స్వయంగా వరి నారు పీకి పొలంలోకి దిగి వరి నాట్లు వేసిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు*
*రైతులతో ప్రేమగా మాట్లాడిన కలెక్టర్*
మెదక్, ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఔరంగాబాద్ గొల్ల నారాయణ రైతు పొలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు వారాంతంలో ఇద్దరు పిల్లలను తీసుకుని కూలీలతో కలిసి ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి, సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.