నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి ప్రతినిధి, మే 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): నీట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో నీట్ పరీక్షపై రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో నీట్ పరీక్ష సన్నాహక సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి లోని బాలుర జూనియర్ కళాశాలలో నీట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ… సంగారెడ్డి జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాల్లో 3,320 విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నారని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్పోర్ట్, సైన్ బోర్డులు, తాగునీరు, పార్కింగ్, టాయిలెట్, వైద్య శిబిరాలు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరా, వీడియోగ్రఫీ, బయోమెట్రిక్ అటెండెన్స్ లు ఉన్నందువల్ల పరీక్షకు హాజరై విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ముందే చేరుకోవాలని ఉదయం 11 గంటల నుంచి 1:30 గంటల వరకు పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇస్తారన్నారు. 1: 30 అనంతరం గేట్లు మూసి వేస్తారన్నారు. పరీక్ష రాయబోయే విద్యార్థులు హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, ఫోటో, తీసుకొని పరీక్షా కేంద్రానికి రావాలన్నారు. హాల్ టికెట్ పైన ఉన్న సలహా సూచనలు తప్పక పాటించాలన్నారు. విద్యార్థులు మొబైల్ ఫోన్, వాచ్, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పెన్నులు, పెన్సిల్ లాంటివి పరీక్షా కేంద్రాలలో తీసుకురావడానికి అనుమతి లేదన్నారు. విద్యార్థులు వేసవి దృశ్య వదులుగా ఉన్న దుస్తులు ధరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సంబంధిత అధికారులు ఉన్నారు.

Join WhatsApp

Join Now