సంగారెడ్డి ప్రతినిధి, జూలై 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ రెండవ విడత నిధులను ప్రభుత్వం జూలై 30న ఉదయం 12 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ ప్రాంగణం నుండి రెండవ విడత రుణమాఫీ విడుదల కార్యక్రమాన్ని లంచానంగా ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 30న ఉదయం 12గంటలకు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారుల సమక్షంలో రెండవ విడత రుణమాఫీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. రెండవ విడత రుణమాఫీ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వ్యవసాయ శాఖ సిబ్బంది సహకార శాఖ సిబ్బంది బ్యాంక్ సిబ్బంది పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో రుణమాఫీ లబ్ధిదారులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.