టీజీపీఎస్ గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

*సంగారెడ్డి జిల్లాలో 49 కేంద్రాల్లో పరీక్ష*

*పరీక్షకు హాజరైతున్న అభ్యర్థులు 15123*

*అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి*

*అభ్యర్థులను ఉదయం 9.00 గంటల నుండి పరీక్షా కేంద్రంలోకి అనుమతి*

*అభ్యర్థులు ఒరిజినల్ ఐడీలతో పరీక్ష కేంద్రం కు రావాలి..*

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. బుధవారం టీజీపీఎస్సీ గ్రూప్-3 పరీక్షల నిర్వహణపై రీజినల్ కోఆర్డినేటర్స్, స్ట్రాంగ్ రూమ్, జాయింట్ కస్టోడియన్స్, పోలీస్ నోడల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, డిఓ, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, జాయింట్ రూట్ ఆఫీసర్స్ తో నిర్వహించిన ట్రైనింగ్ కమ్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. ఈ నెల 17న ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం12.30గంటల వరకు పేపర్-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) పరీక్ష (పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు), సాయంత్రం 3.00 గంటల నుండి 5.30 గంటల వరకు పేపర్ -2 హిస్టరీ, పోలిటి అండ్ సొసైటీ పరీక్ష ( పరీక్ష కేంద్రం గేట్లు మధ్యాహ్నం 2.30 గంటలకు) ఉంటుందని తెలిపారు. 18న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష (పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం 9.30 గంటలకు) ఉంటుందని కలెక్టర్ తెలిపారు. టీజీపీఎస్సీ గ్రూప్ -3 పరీక్షలు సజవుగా, ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 8:30 గంటల వరకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. నిర్దేశించిన సమయం తర్వాత అభ్యర్థులెవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 15123 మంది అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్3 పరీక్ష రాస్తున్నారని వీరి కోసం 49 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అభ్యర్థులు (i) నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్నులు (ii) పెన్సిల్ & ఎరేజర్ (i) హాల్ టికెట్‌ను దానిపై అతికించిన ఫోటో (iv) ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డ్‌ను మాత్రమే పరీక్ష హాల్‌లోకి తీసుకెళ్లాలి. అన్ని సమాధానాలు బాల్ పాయింట్ పెన్ (నీలం/నలుపు)తో మాత్రమే వ్రాయాలి. సెల్ఫోన్, చేతి గడియారాలు, క్యాలిక్యులేటర్ తో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు టీజీపీఎస్సీ సూచనలు పాటించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు. పరీక్ష జరిగేటప్పుడు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని, పరీక్ష ఎంట్రెన్స్ గేట్, పరిష కేంద్రాలు టేబుల్, చేర్స్ సానిటైజ్ చేయాలని, పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలన్నారు, పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఏఎన్ఎం, మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమాజంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అదనపు ఎస్పీ సంజీవరావు, జాయింట్ కస్టోడియన్, చీఫ్ సూపరిండేట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment