రైతుల నుండి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా హత్నుర మండలం పల్పనూరు, చందాపూర్ గ్రామాలలో డిఆర్ డిఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందిస్తున్న సదుపాయాలు, ధాన్యం విక్రయ కేంద్రాల్లో రైతుల సమస్యలు తెలుసుకొని, వాటికి తగిన పరిష్కారాలు చూపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ, రైతులకు అందిస్తున్న సదుపాయాలు, ధాన్యం విక్రయ కేంద్రాల్లో రైతుల సమస్యలు తెలుసుకొని, వాటికి తగిన పరిష్కారాలు చూపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు దాన్యం విక్రయాల్లో నాణ్యత పాటించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో చెల్లింపులు అందించేలా కొనుగోలు చేసిన దాన్ని వివరాలు వెంటనే ట్యాబ్ లో నమోదు చేయాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన దాన్యం తేమ శాతాన్ని కలెక్టర్ పరిశీలించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు విక్రయాలు చేయొద్దని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమయ్యే అన్ని రకాల చర్యలు తీర్చే పట్టాలని సిబ్బందిని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు పంట వివరాలు తప్పుగా నమోదు చేయడం వల్ల ట్యాబ్ లోఎంట్రీ ఆలస్యం జరుగుతుందని నిర్వాహకులు కలెక్టర్ కు తెలిపారు.వెంటనే పంట వివరాలు సరి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఆర్ స్వప్న, తహసీల్దార్ ఫర్హన్ షేక్, ఎంపిడిఓ శంకర్, సమైక్య సంఘాలు ప్రతినిధులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment