మామిడి రకాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

సంగారెడ్డి ప్రతినిధి, మే 17 (ప్రశ్న ఆయుధం న్యూస్):శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని సంగారెడ్డిలోని ఫల పరిశోధన స్థానంలో రెండు రోజులుగా మామిడి రకాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి 280 రకాల మామిడి పండ్లను వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇంత మంచి పండ్ల పరిశోధన స్థానం ఉండడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం అని, ఇంకా మరెన్నో పరిశోధనలు చేసి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ శాస్త్రవేత్తలకు సూచించారు. అనంతరం కలెక్టర్ క్రాంతి యూనివర్సిటీలో చదువుతున్న ఎంఎస్సీ, పిహెచ్ డి విద్యార్థులతో కోర్సుకి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు, ఈ కార్యక్రమంలో ఫల పరిశోధన స్థానం హెడ్ సుచిత్ర, సైంటిస్ట్ హరికాంత్, నితీష్, హార్టికల్చర్ విద్యార్థులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులు, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now