సంగారెడ్డిలో ఈ నెల 21 నుంచి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 21, 22, 23వ తేదీలలో జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి స్థానిక సెయింట్ ఆంటోని ఉన్నత పాఠశాల శాంతినగర్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జరగబోయే వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించి 11 కమిటీలను నియమించడం జరిగినదని, ఈ సంవత్సరం అన్ని యాజమాన్యాల పాఠశాలలు కలిపి సుమారు 850వరకు ఎక్స్ బిట్స్ ప్రదర్శనకు వస్తాయని, ఇన్స్పైర్ కు సంబంధించి 95 ఎగ్జిట్ వస్తాయని తెలియజేశారు. ఈ సంవత్సరం ప్రధాన అంశంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే అంశానికి అనుబంధంగా ఏడు ఉపాంశాలతో జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఇందులో 1.రవాణా కమ్యూనికేషన్, 2.వ్యర్ధాల నిర్వహణ, 3.ఆహారం ఆరోగ్యం మరియు పరిశుభ్రత, 4.సహజ వ్యవసాయం, 5.విపత్తుల నిర్వహణ, 6.గణిత నమూనాలు, గణన ఆలోచనలు, 7.వనరుల నిర్వహణ లాంటి ఉప అంశాలు ఉంటాయని తెలియజేశారు. 21వ తేదీ రోజు వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉదయం 7:30 నుండి ప్రారంభం అవుతుందని, విద్యార్థులందరూ కూడా తమకు సంబంధించిన సబ్ టీమ్స్ వారిగా కేటాయించబడిన కౌంటర్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లుతో పాటు జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, మాజీ సైన్స్ అధికారి విజయ్ కుమార్, నోడల్ అధికారి లింభాజీ, సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్, కోహిర్ మండల విద్యాధికారి, ప్రింట్ అండ్ మీడియా కన్వీనర్ జాకీర్ హుస్సేన్, కో కన్వీనర్ భాస్కర్ , స్థానిక సెయింట్ ఆంథోని ప్రిన్సిపాల్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment