సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 20 (ప్రశ్న ఆయుధం న్యూస్): 35వ సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ సబ్ జూనియర్స్, జూనియర్స్ బాల బాలికలకు జిల్లా స్థాయి ఈతల పోటీల ఎంపికలు ఈనెల 21న ఉదయం 9 గంటలకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్, రాజీవ్ పార్క్ సంగారెడ్డిలో నిర్వహించనున్నట్లు, జిల్లా స్థాయిలో ఎంపికైన వారిని డిసెంబర్ నెలలో భూపాలపల్లి లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని పిడి స్విమ్మింగ్ కోచ్ శేషుకుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు జనధృవీకరణ పత్రం,ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీలను తమ వెంట తీసుకురావాలని కోరారు. మరి ఇతర సమాచారం కోసం 9494991828ను సంప్రదించాలని కోరారు.
ఈ నెల 21 నుంచి సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి ఈతల పోటీలు
Published On: November 20, 2024 9:37 pm