కొత్త చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి: జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్

IMG 20240802 201106
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్):కొత్త చట్టాలు బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. గత నెల జూలై 1వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చిన నూతన చట్టాల అమలులో సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ సమర్ధవంతంగా నూతన చట్టాలను అమలు పరచడం జరుగుతుందని అన్నారు. అధికారులు నూతన చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, నూతన చట్టాలపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలం అని, అందుకు ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది విధిగా నూతన చట్టాలను తెలుసుకొని వుండాలని సూచించారు. ఆన్ లైన్ లో వచ్చిన ఫిర్యాదును సైతం స్వీకరించి, ముందస్తు విచారణ చేయాలని సూచించారు. అవసరమైన కేసులలో సంబంధిత అధికారుల ఉత్తర్వులు పొంది ప్రాధమిక విచారణ చేయవచ్చు అన్నారు. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు కలిసి నేరాలకు పాల్పడితే ఆర్గనైజ్డ్ క్రైమ్ గా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసులో నేరస్థుల ఫోటోలు, వీడియో రికార్డు చేయాలని, గ్రేవ్ కేసులలో అరెస్ట్ చేసిన నేరస్తులకు హ్యాండ్ కాప్స్ వేయాలని సూచించారు. ఇక నుండి నూతన చట్టాల ప్రకారం సమన్స్, వారెంట్స్ ఆన్ లైన్ (సోషల్ మీడియా) ద్వారా అందజేయవచ్చని అన్నారు.  కొత్త చట్టాల అమలులో మంచి పనితీరు కనబరిచిన అధికారులు రివార్డులు ప్రకటించడం జరుగుతుందని ఎస్పీ రూపేష్ తెలిపారు.

Join WhatsApp

Join Now