సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్లో సత్తా చాటిన సంగారెడ్డి జిల్లా సైబర్ సెల్ పోలీస్ కానిస్టేబుల్ రాజలింగంను జిల్లా ఎస్పీ పరితోష పంకజ్ అభినందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత జూలై 31 నుండి ఈ నెల 2వ తేదీ వరకు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, వరంగల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్ లో సంగారెడ్డి జిల్లా నుండి చార్మినార్ జోన్ తరుపున రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్ కు రాజలింగం హాజరయ్యారని చెప్పారు. కంప్యూటర్ అవేర్నెస్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయిలో 3వ స్థానంలో నిలవడం జరిగిందని, రాష్ట్ర స్థాయిలో జిల్లా పేరును ముందు ఉంచడంలో మంచి ప్రతిభ కనబరిచాడని, రాజలింగంను అభినందించారు. పూణెలో జరిగే నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్ లో మెరుగైన ప్రదర్శన చూపి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని అన్నారు.
కానిస్టేబుల్ రాజలింగంను అభినందించిన జిల్లా ఎస్పీ
Published On: August 4, 2025 7:06 pm