కొండాపూర్, సదాశివపేట పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ..

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): నేరాల నియంత్రణ, నేర చేదనలో ఉపయోగపడే సిసికెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా చెరువులు, కుంటల వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. శనివారం కొండాపూర్, సదాశివపేట పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల మెయింటెనెన్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్థులను తనిఖీ చేస్తూ, లాంగ్ పెండింగ్ కేసులలో ఇన్వెస్టిగేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సందేహాలున్న ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్.హెచ్.ఓకు సూచించారు. పోలీసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని వారిసమస్యను ఓపికగా విని సత్వర న్యాయానికి కృషి చేయాలని ఎస్.హెచ్.ఓ లకు సూచించడం జరిగింది. సమస్యలతో స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదిదారులతో వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. బ్ల్యూ కొల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది తమకు కేటాయించిన ఏరియాలో గస్తీ కాస్తూ, అనుమానిత వ్యక్తుల నుండి “పాపిలోన్” డివైస్ ను వినియోగించి, ఫింగర్ ప్రింట్స్ సేకరించాలని, రౌడీ, కేడీ, సస్పెక్ట్ లను చెక్ చేయాలన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ.. ఆయా వర్టికల్ విభాగాలలో ఉత్తమ ప్రతిభ చూపి జిల్లాను ముందు వరుసలో నిలపడానికి కృషి చేయాలని అన్నారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, తమ ఏరియాలో గల చెరువులు, కుంటల ఆనకట్టలు ప్రమాదం అంచున ఉన్నట్లయితే ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, ఈద్ మిలాడ్ ఉన్ నబీ పండగలు ఏకకాలంలో వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాట్లను చేసుకోవాలని ఎస్.హెచ్.ఓలకు సూచనలు చేశారు. మన చుట్టూ జరుగుతున్న ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, రోడ్డు ప్రమాదాల గురించి కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా జిల్లా ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నేరాల నివారణకు, జరిగిన నేరాలను చేధించడానికి కీలకంగా ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ.. సిసి కెమెరాల ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. ఈ సందర్శనలో సదాశివపేట ఇన్స్ పెక్టర్ డి.వెంకటేశ్, కొండాపూర్ ఇన్స్ పెక్టర్ సుమన్, ఎస్ఐ సోమేశ్వరి, సిబ్బంది ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment