సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రతి కేసులో నాణ్యమైన ధర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని, లాంగ్ పెండింగ్ కేసులు, ఎబ్.బి.డబ్ల్యూ ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వివిధ రకాల నేరాల గురించి అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. అండర్-ఇన్వెస్టిగేషన్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్ మరియు ఎబ్.బి.డబ్ల్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్వెస్టిగేషన్ లో వేగం పెంచాలని, ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును చేయాలని అధికారులకు సూచనలు చేశారు. పోక్సో, అత్యాచార కేసులలో వీలైనంత తొందరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని, అందుకు భరోసా సెంటర్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. ఇన్వెస్టిగేషన్ లో ఏవైనా సందేహాలు ఉంటే ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకొని, నివృత్తి చేసుకోవాలని, ఎన్.బి.డబ్ల్యూ పెండింగ్ కేసులలో సబ్-డివిజన్ పరిదిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పెండెన్సీ తగ్గించాలని అన్నారు. ఎస్.హెచ్.ఓలు ప్రతిరోజు సిబ్బందితో మాట్లాడుతూ.. సిబ్బంది యోగక్షేమాలు తెలుసుకోవాలని, సిబ్బందికి సమస్యలున్నట్లైతే వెంటనే స్పందించాలన్నారు. మహిళా సిబ్బంది పట్ల మర్యాదగా నడుచుకోవాలని, పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడాలని, వారి సమస్యను ఓపిగ్గా విని, వారి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎస్.హెచ్.ఓలు తమ పరిధిలో గల అన్ని గ్రామాలను నెలలో ఒకసారైనా సందర్శించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ, మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల నేరాలు, ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. బ్లూకోల్ట్స్ మరియు నైట్ పెట్రోలింగ్ సిబ్బంది “ఫింగర్ప్రింట్ డివైస్” లను వినియోగిస్తూ.. అనుమానాస్పద వ్యక్తుల ఫింగర్ ప్రింట్స్ సేకరించాలన్నారు. నూతన చట్టాలపై సిబ్బంది, అధికారులు అవగాహన కలిగి ఉండాలని, చిన్నపిల్లల్ని విచారించేటప్పుడు చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్లో, సాధారణ దుస్తువులు దరించి, ఫ్రెండ్లీ వాతావరణంలో విచారించాలని అన్నారు. సబ్-డివిజన్ పరిధిలో ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం” నిర్వహిస్తూ కొత్త వ్యక్తులను గుర్తించాలని, సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయాలని అధికారులకు సూచించారు. ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కలిసి నేరం చేసినట్లయితే, వారిపై గ్యాంగ్ కేసులను నమోదు చేయాలని అన్నారు. గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు ఏక కాలంలో వస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా మండల కేంద్రాలలో పీస్ కమిటీ మరియు డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. సబ్-డివిజన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన త్వరితగతిన స్పందించడానికి “క్యూ.ఆర్.టి” (క్విక్ రియాక్షన్ టీం) లను ఏర్పాటు చేయాలని డీఎస్పీలకు సూచించారు. గణేష్ చతుర్థి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని లౌడ్ స్పీకర్స్, మైక్స్ పరిమిత లిమిట్లో, నిర్దిష్ట సమయం వరకే వినియోగించేలా మండప యజమానులకు గైడ్ చేయాలని అధికారులకు ఎస్పీ సూచించారు. గంజాయి స్మగ్లర్లపై జిల్లా కేంద్రం నుంచి నిఘా ఉంటుందని, అదేవిధంగా తమ తమ ఏరియాలో గల డ్రగ్ సెల్లర్స్, డిమాండ్స్ దారులను గుర్తించి కేసులు నమోదు చేయాలని ఎస్. హెచ్. ఓ. లకు సూచించారు. ప్రజలు “హ్యాక్-ఐ” అప్లికేషన్ గురించి తెలుసుకొని అప్లికేషన్ ద్వారా మనకు అవసరమైన సేవలను పొందవచ్చు అని జిల్లా ప్రజలకు సూచించారు. ఆన్లైన్ మోసాలు, మల్టీలెవెల్ మార్కెటింగ్ పై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని మల్టీలెవెల్ మార్కెటింగ్ నిర్వాహకులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుండి కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ, పోలీస్ అధికారులం అంటే నమ్మరాదని ఆన్లైన్ లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ అన్నీ కుల మతాలకు చెందిన పవిత్ర స్థలాలు, పరిశ్రమలలో తదితర ముఖ్యమైన ప్రాంతాలలో కమ్మునిటీ సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా., ఇంటి రక్షణకై ఏర్పాటు చేసుకున్న సిసి కెమెరాలలో ప్రజలకు ఉపయోగపడే, వీధి రోడ్డుకు ఉన్న కెమెరాలను నేను సైతం కెమెరాలుగా జియో ట్యాగ్ చేయించే విధంగా వివిధ సంఘాల పెద్దలకు అవగాహన కల్పించాలని యస్.హెచ్.ఒ లకు సూచనలు చేశారు. అనంతరం వివిధ కేసులలో నిందితులకు జీవిత ఖైదు పడేలా వాదనలు వినిపించిన, పి.పి శైలజ, విజయ్ శంకర్ రెడ్డి, సత్యనారాయణ, రాజేశ్వర్, సూర్ రెడ్డి లను ఎస్పీ అభినందించి, సత్కరించారు. అదే విధంగా వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ అభినందించి, రివార్డ్ లు అందజేశారు. అనంతరం యస్.హెచ్.ఓ వాహనాలను తనిఖీ చేస్తూ. ప్రతి వెహికిల్ ను రెగ్యులర్ సర్వీస్ చేయించాలని, ఎలాంటి రిపేర్స్ ఉన్న తక్షణమే నివృత్తి చేస్తూ. వెహికిల్ పూర్తి స్థాయిలో కండిషన్ లో ఉండే విధంగా చూసుకోవాలని డ్రైవరులకు సూచించారు. ఈ వాహనాల తనిఖీలలో ఎఆర్ డియస్పీ నరేందర్, వెహికిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, అడ్మిన్ ఆర్.ఐ. రామారావ్ ఉన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సంగారెడ్డి డియస్పి సత్యయ్య గౌడ్, పటాన్ చెర్వు డియస్పి ప్రభాకర్, జహీరాబాద్ డియస్పి సైదా నాయక్, నారాయణ ఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి,సైబర్ క్రైమ్ డియస్పి వేణుగోపాల్ రెడ్డి, డీసీఆర్బీ డియస్పి సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్.బి ఇన్స్పెక్టర్ కిరణ్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, ఎస్.నాబ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవి మరియు జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.