సంగారెడ్డి ప్రతినిధి, జూలై 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల పాటు (ఆగస్ట్ 1వ తేదీ నుండి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున పోలీసుల ముందస్తు అనుమతి లేనిది సంగారెడ్డి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా, ప్రజాధనానికి నష్టం కల్గించే, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఇట్టి విషయంలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు. అనుమతి లేకుండాపై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
జిల్లాలో నెల రోజుల పాటు పోలీసు యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: July 31, 2025 7:06 pm