పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): పోలీస్ ఫ్లాగ్ డే/ పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగలను స్మరిస్తూ శనివారం సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సంగారెడ్డి పట్టణంలోని వివిధ పాఠశాల నుండి వచ్చిన విద్యార్ధిని, విద్యార్థులకు మహిళల భద్రతకై షీ-టీమ్స్ పాత్ర, వివిధ రకాల సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాలు, శాంతి భద్రతల రక్షణలో పోలీస్ శాఖ పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో సైబర్ నేరాలకు గురి కాకుండా ఉండటానికి తీసుకోవలసిన చర్యల గురించి జిల్లా సైబర్ సెక్యూరిటీ సిబ్బంది షార్ట్ ఫైల్ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందని, మహిళలపై జరుగుతున్న వేదింపుల నుండి బయట పడటానికి జిల్లా షీ-టీంకు సమాచారం అందించాలని, మహిళలు షీ-సేఫ్ అప్లికేషన్ వినియోగించాలని అత్యవసర సమయంలో డైల్ 100 చేయాలని షీ-టీం, భరోసా సిబ్బంది మహిళల భద్రత గురించి వివరించడం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్ధిని, విద్యార్థులను చైతన్య పరచడం జరిగిందని, మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంటూ.. మాదక ద్రవ్యాల నిర్మూలనలో జిల్లా పోలీసు శాఖతో కలిసి నడుస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
*విద్యార్థులకు వివరించిన విషయాలు…*
*ఫ్రెండ్లీ పొలిసింగ్ విధానం ద్వారా ప్రజలకు మరింత దగ్గర అవుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం డే/నైట్ బీట్స్, పెట్రోలింగ్ వ్యవస్థలు తదితర అంశాల గురించి వివరించడం జరిగింది.
*పోలీసు శాఖ నేరస్తులను సులువుగా గుర్తించడం కోసం అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ సిస్టం, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి నూతన సాంకేతికతల గురించి వివరించారు.
*మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్ లు, భరోసా సెంటర్ పని తీరును వివరించడం జరిగింది. 
*డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్స్ మరియు బాంబ్ డిస్పోసల్ టీం పని తీరును వివరించడం జరిగింది.
*సైబర్ నేరాల గురించి ఏవిధంగా అప్రమత్తంగా వుండాలి, ఆన్లైన్ లో అపరిచితులతో పరిచేయాలకు దూరంగా ఉండాలని, ఏదైనా సైబర్ క్రైమ్ కు గురి అయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి మీ యొక్క ఫిర్యాదు నమోదు చేయాలని వివరించడం జరిగింది. పై విషయాలకు సంబంధించి బాంబ్ స్క్వాడ్ టీం, ట్రాఫిక్ సిబ్బంది, సైబర్ సెల్, భరోసా సిబ్బంది, తదితరులు  విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరును వివరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment