ప్రతి కేసులో దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రతి కేసులో దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని, లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకొని, ఇన్వెస్టిగేషన్ లో మెళకువలు నేర్చుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా మంగళవారం సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారులతో నెల వారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా ఉండాలని, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్లో ఉండాలన్నారు. అత్యాచార, పొక్సో కేసులలో దర్యాప్తును వేగవంతం చేయాలని, నిర్ణిత గడువులో దోషులను న్యాయస్థానం ముందు ఉంచాలని అన్నారు. లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ఎఫ్.ఎస్.ఎల్ పెండింగ్ రిపోర్ట్స్ పొంది, కేసులను ఫైనల్ చేయాలని అన్నారు. నెంబర్ పెండింగ్ కేసులలో సంభందిత మెజిస్ట్రేట్ లతో డిస్కస్ చేసి సిసి నెంబర్లను తీసుకోవాలని యస్.హెచ్.ఓలకు సూచించారు. ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకొని, ఇన్వెస్టిగేషన్ లో మెళకువలు నేర్చుకోవాలని అన్నారు. నేరం జరిగిన వెంటనే నేరస్తాలనికి చేరుకొని, నేరస్థలంలో ఉన్న సాక్షాదారాలు చెరిగిపోకుండా ప్రొటెక్ట్ చేస్తూ నేరస్థల చిత్రపటాలు తీయించాలని, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం సహాయాంతో ఆధారాలు సేకరించాలని అన్నారు. ఆస్తి సంభందిత నేరాలకు సంభందించి పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, పాపిలోన్ డివైస్ ను వినియోగించి, ఛాయిస్ ప్రింట్ ద్వారా వీలైనంన్ని ఎక్కువ కేసులను ఛేదించాలని అన్నారు. గ్రేవ్, ఆస్థి సంభందిత నేరాలలో నేరస్తుల ఫింగర్, అరచేతి ముద్రలు తప్పనిసరిగా చేకరించి, ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల నేరాలను ఛేదించడంలో ఫింగర్ ప్రింట్, క్లూస్ టీం సిబ్బంది సేవలు అభినందనీయం అని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మోసాలు, డ్రగ్ దుర్వినియోగం మరియు ట్రాఫిక్ రూల్స్ పై జిల్లా ప్రజలలో, విద్యా సంస్థలలో కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని యస్.హెచ్.ఒలకు సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆన్లైన్ లో వీడియో కాల్స్ చేసి, పోలీసు అధికారులం అంటే నమ్మరాదని, ఏ పోలీసు అధికారులు వీడియో కాల్స్ చేయరాని గుర్తించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, సైన్ బోర్డులను ఏర్పాటు చేయించాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా ప్రతి రోజు సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేస్తూ, మద్యం తాగి వాహనాలను నడిపే వాహన దారీలపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పు పై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ అన్నీ కుల మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో మరియు పరిశ్రమలలో తదితర ముఖ్యమైన ప్రాంతాలలో కమ్మునిటీ సిసి కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా., ఇంటి రక్షణకై ఏర్పాటు చేసుకున్న సిసి కెమెరాలలో ప్రజలకు ఉపయోగపడే, వీధి రోడ్డుకు ఉన్న కెమెరాలను నేను సైతం కెమెరాలుగా జియో ట్యాగ్ చేయించేవిధంగా వివిధ సంఘాల పెద్దలకు అవగాహన కల్పించాలని యస్.హెచ్.ఒ లకు సూచనలు చేశారు. అనంతరం యస్.హెచ్.ఓ వాహనాలను తనిఖీ చేస్తూ. ప్రతి వెహికిల్ ను రెగ్యులర్ సర్వీస్ చేయించాలని, ఎలాంటి రిపేర్స్ ఉన్న తక్షణమే నివృత్తి చేస్తూ. వెహికిల్ పూర్తి స్థాయిలో కండిషన్ లో ఉండే విధంగా చూసుకోవాలని డ్రైవరులకు సూచించారు. ఈ వాహనాల తనిఖీలలో ఎఆర్ డియస్పీ నరేందర్, వెహికిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, అడ్మిన్ ఆర్.ఐ. రామరావ్ ఉన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సంగారెడ్డి డియస్పి సత్తయ్య గౌడ్, పటాన్ చెర్వు డియస్పి ప్రభాకర్, జహీరాబాద్ డియస్పి సైదా నాయక్, నారాయణ ఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఐటి సెల్ ఇన్స్పెక్టర్ కిరణ్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సైబర్ క్రైమ్ డియస్పి వేణు గోపాల్ రెడ్డి ఇన్స్పెక్టర్ రవి మరియు జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్ఇన్స్పెక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment