సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ బ్యాంక్ లకు చెందిన మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్లతో బ్యాంకుల భద్రతపై జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బ్యాంక్ లలో భద్రత, సైబర్ నేరాలలో రీఫండ్ ప్రక్రియలో స్పందించవలసిన తీరు, సైబర్ మోసగాళ్ల ఖాతాల ఓపెయింగ్ లో తీసుకోవలసిన చర్యల గురించి బ్యాంకర్స్ తో చర్చించారు. ప్రతి బ్యాంకులో ప్రధానంగా సిసి టీవి కెమెరాలు పని చేసే విధంగా చూసుకోవాలని, సిసి కెమెరాలు సెన్సార్ మోషన్ ఉండే విధంగా చూడాలని, సెక్యూరిటీ అలారమ్స్ పని చేస్తున్నాయా.. లేదా అని చెక్ చేసుకోవాలని సూచించారు. లైసెన్స్ ఆయుధాలు కలిగిన సిబ్బందిని సెక్యూరిటీ గా నియమించుకోవాలని అన్నారు. బ్యాంక్ నుండి పోలీసు స్టేషన్ ఎంత దూరంలో ఉందని, పోలీసు స్టేషన్, అధికారుల ఫోన్ నెంబర్స్ తదితర వివరాలను సిబ్బంది తెలుసుకొని ఉండాలని అన్నారు. తరుచూ సెక్యూరిటీ అడిట్స్ జరిగే విధంగా చూడాలని, ఆధునిక సాంకేతికతను కలిగిన సెన్సార్ లను బ్యాంక్ లలో అమార్చాలని, విలువైన సమాచారాన్ని అందరితో షేర్ చేయవద్దని సూచించారు. అత్యవసర సమయాలలో డైల్ 100 చేయాలన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి, బ్యాంక్ అధికారులు ఓటీపీలు అడగరని, అనవసర లింక్స్ షేర్ చేయరని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొత్త అకౌంటు ఓపెనింగ్ కోసం వచ్చిన వ్యక్తుల ఫోన్ నంబర్స్, ఆధార్ తదితర వివరాలను అడిగిన తర్వాతనే ఖాతాను ఓపెన్ చేయాలని సైబర్ నేరగాళ్లు తప్పుడు ఫోన్ నెంబర్స్ తో అమాయక ప్రజల పేర్లతో ఖాతాలను తెరిచి, వివిధ రకాల సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. సైబర్ నేరాలలో బాధితులకు అంధించే రీఫండ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, రీఫండ్ ప్రక్రియలో పోలీసు వారికి సహకరించవలసిందిగా సూచించారు. వివిధ రకాల బ్యాంక్, ఏటిఎం దొంగతనాలు, సైబర్ నేరాలకు సంబంధించి కేసు స్టడీ లను చెపుతూ.. అప్రమత్తంగా ఉండాలనై అదే విధంగా ప్రజలను అప్రమత్తం చేయాలని, సైబర్ మోసాల గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ సమావేశం లో డి4సి డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ నర్సింగ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, వివిధ బ్యాంక్ లకు చెందన సుమారు 100 మంది మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్ తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకులలో సీసీ కెమెరాలను, వాల్ సెన్సార్ లను ఏర్పాటు చేయాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: August 25, 2025 8:28 pm