సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): 9వ రోజు వినాయక నిమార్జనాలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వినాయకులు నిమర్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరవు వద్ద ఏర్పాట్లను ఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించారు. సబ్-డివిజన్ల వారీగా డీఎస్పీల పర్యవేక్షణలో నిమర్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, అందుకు సహకరించిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు, జిల్లా ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
వినాయక నిమర్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: September 5, 2025 8:35 am