పోలీసు కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): మీ సమస్యలకు సత్వర న్యాయం జరగనప్పుడు.. మూడవ వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని రావచ్చుని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగం వివిధ మండలాల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారుల సమస్యలను ఓపికగా విని, వారి సమస్య స్థితి, జాప్యానికి గల కారణాలను సంబంధిత ఎస్.హెచ్.ఓకు ఫోన్ ద్వారా మాట్లాడి.. వివరాలను తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. చట్టాన్ని అమలు పరచడంలో ఎలాంటి అలసత్వం చూపరాదని, చట్ట ప్రకారం కేసులను పరిష్కరించాల్సిందిగా యస్.హెచ్.ఓ.లకు సూచించారు. జిల్లా ప్రజలు తమ సమస్యకు స్థానికంగా పరిష్కారం దొరకని సందర్భంలో నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలకు తావు లేకుండా స్వచ్చంధంగా జిల్లా పోలీసు కార్యాలయ సేవలను వినియోగించుకోవాలని అన్నారు. సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించేందుకు, సత్వర న్యాయం చేసేందుకు, పోలీసు శాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment