ఇమాంపూర్ లో నూతన సీసీ కెమెరాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు

మెదక్/తూప్రాన్, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): తూప్రాన్ మండలం ఇమాంపూర్ లో ఏర్పాటు చేసిన సీసీ కమాండ్ కంట్రోల్ కెమరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, అడిషనల్ ఎస్పీ మహేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఒక్కొక్క సీసీ కెమరా వంద మంది పోలీసులతో సమానం అని సీసీ కెమెరాల ప్రాధాన్యత గూర్చి వివరించారు. ఇమాంపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల అమరికలు చాలా అద్భుతంగా ఉన్నాయని ఇంత చక్కగా సీసీలను తీర్చిదిద్దిన తూప్రాన్ డీఎస్పీ, సీఐ, ఎస్ఐ, మున్సిపల్ కమిషనర్ లను జిల్లా ఎస్పీ ప్రశంసించారు. మండలంలోని ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు కలసికట్టుగా వారి సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ మధ్య కాలంలో చాలా మట్టుకు క్రైమ్ పెరిగిపోవడం జరిగిందని, దీనికీ అనుకూలంగా సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని, అర్ధరాత్రుల్లో అపరిచిత వ్యక్తులు ఏ ప్రాంతములో తిరిగిన సీసీలో రికార్డు అవుతాయని, దీని బట్టి చొరికి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం సులువుగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ మహేందర్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ రంగా కృష్ణ, ఎస్ఐ శివానందం, నాయకులు సత్యనారాయణ గౌడ్, రమేష్, నవీన్ గౌడ్, యదగిరి, మన్నె యాదగిరి, స్వామి, సత్యనారాయణ, పాండు ఎ.రాములు, స్వామి గౌడ్, జనార్దన్,శివ గౌడ్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment