మెదక్, ఆగస్టు 16 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇటీవల కాలంలో ఏడుపాయలలో జరిగిన దొంగతనం, పరిసర ప్రాంతాలను స్వయంగా పరిశీలించి అక్కడి ఆలయ కమిటీ సిబ్బందితో మెదక్ జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. ఆలయ ఏవోతో ఫోన్లో మాట్లాడి త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏడుపాయల రక్షణ, దొంగతనాల నివారణపై వచ్చే మంగళవారం చర్చించి, ఆలయ పరిసర ప్రాంతాల పరిరక్షణకు దొంగతనాల నివారణలపై పకడ్బందీ చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్నపేట్ ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.