కామారెడ్డి సబ్ డివిజన్ సందర్శించిన జిల్లా ఎస్పీ
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి సబ్ డివిజన్ కార్యాలయంను బుధవారం జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర, సందర్శించారు.
ఈ సందర్బంగా కామారెడ్డి సబ్ డివిజన్ కార్యాలయంను, పరిసరాలతో పాటు, రికార్డ్ గదులను పరిశీలించి, సబ్ డివిజన్లో గల పోలీస్ స్టేషన్ లకు సంబందిచిన అధికారుల, సిబ్బంది వివరాలను ఏఎస్పి చైతన్య రెడ్డి ఐపిఎస్ ని అడిగి తెలుసుకున్నారు.
ఎస్పి వెంట జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య ఉన్నారు.