సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డుల మెయింటెనెన్స్, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసులలో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లాంగ్ పెండింగ్ కేసుల చేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సందేహాలున్న ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఎస్.హెచ్.ఓకు సూచించారు. ఆస్తి సంభందిత నేరాలు జరుగుతున్న ప్రాంతాలను హాట్ స్పాట్ గా గుర్తించి, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్.హెచ్.ఓకు సూచనలు చేశారు. సిబ్బంది ప్రతి ఒక్కరు అన్ని రకాల విధులను తెలుసుకొని ఉండాలని, మారుతున్న సమాజానికి అనుగుణంగా, ఎలాంటి విధులనైనా చేయగలిగే విధంగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని/ ఆధునిక సాంకేతికతను అందించుకోవాలని సూచించారు. జిల్లాలో పటాన్ చెరు సబ్-డివిజన్ ఏరియాలో అధికంగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ నేరాల నివారణ గురించి ప్రజలలో విధ్యా సంస్థలాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలన్నారు. సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యువత ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ.. సైబర్ మోసగాళ్ళ పన్నిన వలలో చిక్కుతున్నారని, ఈస్సీ మనీ అనేది సైబర్ నేరగాళ్ల పన్నాగం అని గుర్తించాలని యువతకు సూచించారు. నేరాల నియంత్రణ, జరిగిన నేరాలను చేధించడానికి కీలకంగా ఉపయోగపడే సిసి కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ.. ధాబాలు, పెట్రోల్ పంపులు, విధ్యా సంస్థలు, షాప్స్ లలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. అనంతరం పోలీసు స్టేషన్ కు వచ్చిన ఫిర్యాది దారులతో స్వయంగా మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పటాన్ చెర్వు పోలీసులు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. పోలీసు శాఖ మరిన్ని మెరుగైన సేవలను అందించడానికి పోలీసు శాఖ పని తీరుపై ప్రజల అభిప్రాయం చాలా అవసరం అని అన్నారు.
పటాన్ చెరు పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Published On: August 5, 2025 7:35 pm