ఉపాధ్యాయుడు హరికృష్ణ శర్మకు డాక్టరేట్

IMG 20241229 085941
మెదక్/నర్సాపూర్, డిసెంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన వేద పండితుడు, రాజపురోహితుడు, ఉపాధ్యాయుడు గౌడిచర్ల హరికృష్ణ శర్మకు డాక్టరేట్ ను ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యూఎస్ఏ చైర్మన్ డాక్టర్ రమేష్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.. శనివారం ముషీరాబాద్ సిటీ కల్చర్ ఆడిటోరియంలో ఏషియన్ కల్చరల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ యూఎస్ఏ మరియు స్ఫూర్తి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అకాడమీ ఆధ్వర్యంలో హరికృష్ణ శర్మను సత్కరించి గౌరవ డాక్టరేట్ అవార్డును ప్రధానం చేయడం జరిగిందన్నారు. ఆధునిక జ్యోతిష్య శాస్త్ర విద్యలో మరియు వేద గణితంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఆయనను సన్మానిస్తున్నట్టు తెలిపారు. అనంతరం డా.హరికృష్ణ శర్మ.. మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ అవార్డు నా యొక్క బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. వేద గణితము మరియు జ్యోతి శాస్త్రాన్ని ఆధునిక ప్రపంచంలో నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉపయోగించడానికి కృషి చేస్తానని డా.హరికృష్ణ శర్మ అన్నారు.

Join WhatsApp

Join Now