అంతర్జాతీయ విద్యా పురస్కారంకు డా.రామకృష్ణ ఎంపిక

IMG 20250501 164456
సంగారెడ్డి ప్రతినిధి, మే 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): వరల్డ్ చారిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఢిల్లీ వారి ఆధ్వర్యంలో మే 28న ఏఎస్ రావు నగర్ రెసిడెన్సి, ఈసీ ఐఎల్ హైదరాబాద్ లో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ (కె) పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న డాక్టర్. పోట్రు రామకృష్ణ విద్యా రంగంలో అంతర్జాతీయ విద్యా పురస్కారం 2025కు ఎంపికైనట్లు వరల్డ్ చారిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ మేనేజర్ మమతా కడ్రక తెలిపారు. రామకృష్ణ ఈ పురస్కారాన్ని ప్రముఖుల చేతుల మీదుగా అందుకుంటారని అన్నారు. ఈ మేరకు రామకృష్ణకు ఆహ్వాన పత్రం అందింది. రామకృష్ణ ఇటు విద్యారంగం.. అటు సామాజిక సేవా రంగంలోనూ మరియు పర్యావరణ పరిరక్షణకు చేసే విశేష కృషికి గాను ఈ పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. తనను అంతర్జాతీయ విద్యా పురస్కారంకు ఎంపిక చేసినందుకు వరల్డ్ చారిటి వెల్ఫేర్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now