సంగారెడ్డి ప్రతినిధి, జూలై 3(ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో ఉన్న రాష్ట్ర విత్తన క్షేత్రంలో కొత్తగా నియమితులైన సహాయ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ డి.వైద్యనాథ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విత్తన క్షేత్ర కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. డాక్టర్ వైద్యనాథ్ జిల్లాలో వ్యవసాయ శాఖలో కీలక పదవులు నిర్వహించి, రైతులకు మెరుగైన సేవలు అందించిన అనుభవం ఉన్న వేత్తగా పేరుగాంచారు. ఆయన నియామకంతో విత్తన క్షేత్ర అభివృద్ధికి మరింత బలం చేకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, వ్యవసాయ శాస్త్రంపై అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం విత్తన క్షేత్ర కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు శారదా దేవి, సంధ్య, వ్యవసాయ విస్తరణ అధికారి సౌమ్య, అకౌంటెంట్ సురేష్, సిబ్బంది వీరప్ప, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.