దంపతులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి వినతి

సంగారెడ్డి, అక్టోబర్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): లింగాయత్ పెద్దలు బత్తుల వీరన్న, సతీమణి వరలక్ష్మిపై దాడిని ఖండిస్తూ నిందుతులను కఠినంగా శిక్షించాలని కోరుతూ డీఎస్పీ సత్తయ్యను వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం సంగారెడ్డి జిల్లా తరుపున కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని, మద్యం మత్తులో యువకులు వీరంగం చేశారని అన్నారు. టేక్మాల్ మండల వాస్తవ్యులు భత్తుల వీరప్ప ఆయన సతీమణి భక్తుల వరలక్ష్మిలు సంగారెడ్డి నుండి జోగిపేట వైపు వస్తుండగా.. అందోల్ కు చెందిన యువకులు కటికే జాఫర్, షాహిద్ లు తన కారుకు బైక్ అడ్డంగా పెట్టి తాగిన మత్తులో ఆయనపై దాడికి పాల్పపడ్డారని అన్నారు. కారులోనే ఉన్న ఆయన సతీమణి వరలక్ష్మిపై కూడా దాడి చేయడంతో దారిన పోయే ప్రయాణికులు వారించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వారిని రిమాండ్ పంపినట్లు తెలిపారు. సంఘటన స్థలాన్ని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య పరిశీలించి, దాడులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం సంఘ పెద్దలు మాట్లాడుతూ.. జరిగిన సంఘటనను ఖండిస్తూ ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని, మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ శాఖను కోరారు. డీఎస్పీని కలిసిన వారిలో వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం గౌరవ అధ్యక్షుడు ధనంజయ, అధ్యక్షులు పృథ్వి రాజు, కోశాధికారి గోవురాజు, ఉపాధ్యక్షుడు రాజేశ్వర్ స్వామి, ఉపకోశాధికారి శివ, యువజన అధ్యక్షుడు బుగ్గనగారి మల్లికార్జున్, సలహాదారులు చెంద్రశేఖర్, జగదీశ్వర్, సభ్యులు చాట్ల శ్రీనివాస్, గౌలిశ్వర్, బోడపల్లి అమర్నాథ్, మల్లికార్జున శెట్టి, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment