తాదాన్‌పల్లి, గంగిజిపేట అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించిన డీడబ్ల్యూవో లలితకుమారి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): జోగిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని పుల్కల్ మండలం తాదాన్‌పల్లి, గంగిజిపేట అంగన్‌వాడీ కేంద్రాలను శుక్రవారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి లలితకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల నిర్వహణ, పిల్లలకు అందిస్తున్న ఆహారం, గర్భిణీ, బాలింతల హాజరు వంటి అంశాలను సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ సిబ్బంది కేంద్రాలను శుభ్రంగా, పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారని, మెనూ ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం తయారు చేసి పిల్లలకు అందిస్తున్న విధానం సంతృప్తికరంగా ఉందని తెలిపారు. పిల్లల పోషణ స్థాయిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తల్లిదండ్రులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కేంద్రాలలో పిల్లల అభివృద్ధి, విద్యా కార్యకలాపాలపై కూడా దృష్టి సారించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో జోగిపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, సూపర్వైజర్లు, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment